ఉపాధి హామీ కూలీలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఉపాధి హామీ వేతనాలను కేంద్రం రూ.15 మేర పెంచింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో AP, TS రూ. 257 గా ఉన్న కూలీ రూ.272 కు చేరింది.
అత్యధికంగా హర్యానాలో రూ. 357, కేరళలో రూ. 333, గోవాలో రూ. 322, కర్ణాటకలో రూ. 316, లక్షద్వీప్ లో రూ. 304, పంజాబ్ లో రూ. 303, పుదుచ్చేరి, తమిళనాడులో రూ. 294 కూలీ దక్కనుంది. అన్ని రాష్ట్రాల్లో సమాన వేతనాలు అమలు చేయాలన్న స్థాయి సంఘం నివేదికను కేంద్రం పట్టించుకోలేదు.