కావాల్సినవి :
మినుములు : 500 గార.
అల్లం : 200 గ్రా.
పచ్చిమిర్చి : 3
జీలకర్ర : ఒక టీస్పూన్
ఉల్లిగడ్డలు : 2
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె, ఉప్పు : తగినంత
తయారీ :
మినుములను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండిని చిన్న చిన్న గారెల్లాగా చేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇలా మిశ్రమం మొత్తం చేసుకోవాలి. రుచికరమైన గారెలు మీ నోరూరిస్తాయి.