ఓరి నాయనో.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు..

-

సోషల్ మీడియాలో ఈ మధ్య రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తున్నారు..కొన్ని వంటలు బాగా రుచిగా ఉంటే మరికొన్ని వంటలు మాత్రం జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు మరో కొత్త వంట వైరల్ అవుతుంది.. వాస్తవానికి తినే ఆహారంపై ప్రయోగాలను భిన్నమైన ఆహారవంటకాలను కలుపుతూ తయారు చేస్తూ ఉంటారు. వాటి రుచికి భిన్నంగా స్పెషల్ రుచిని అందించి కొత్త వంటకాన్ని సృష్టించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒకొక్కసారి ఇటువంటి ప్రయోగాలు బెడిసికొడతాయి.

తాజాగా ఒక సరికొత్త వంటకం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. అయితే ఈ వీడియోలో వంటకం చూస్తే తినాలనే కోరిక చచ్చిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆ స్పెషల్ డిష్ ఏమిటో చూద్దాం..స్నాక్స్ ఐటెమ్స్ లో సమోసా, రైస్ పదార్ధాల్లో బిర్యానీ ఈ పేర్లు చెబితే చాలు నోరు ఊరుతుంది. వెంటనే తినాలనే ఫీలింగ్ కలుగుతుంది. సమోసాలను స్నాక్ ఐటెం గా లేదా కొందరు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే, బిర్యానీని భోజనంగా తీసుకుంటారు.

రెండిటి టేస్టులు డిఫరెంట్.. రెండు ఫుడ్ ఐటెమ్స్ కు ఫ్యాన్స్ కూడా ఉంటారు..ఈ రెండు కలిపి చేసిన సమోస గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి చూసేద్దాం పదండీ..ముందుగా చపాతీ పిండిని ముద్దగా చేసి.. దానిని సమోసా షేర్ లో చుట్టి.. అందులో ఫుడింగ్ గా బిర్యానీ తో ఫీల్ చేశాడు. ఇదే విషయాన్నీ చిత్రంలో చూడవచ్చు. ఈ చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ వంటకాన్ని చూసి కామెంట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఒక లుక్ వేసుకోండి..

 

Read more RELATED
Recommended to you

Latest news