ఇటీవల రేవంత్ రెడ్డి అలాగే.. బండి సంజయ్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావాను కేటీఆర్ వేసిన సంగతి తెలిసిందే. అయితే… దానికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు రూ.100 కోట్లు ఇస్తే.. బూతులు తిట్టవచ్చా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ను అవినీతి పరులకు అడ్డగా మార్చింది బిఆర్ఎస్ సర్కార్ అని ఆగ్రహించారు. పబ్లిక్ డొమైన్ లో లేని సమాచారం కేటీఆర్ వద్దకు ఎలా వచ్చింది ? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కేటీఆర్ ఎలా తెలుస్తోంది ? అని నిలదీశారు.
కటాఫ్ మార్కులు ఎన్ని అనేది కేటీఆర్ కు ఎలా తెలుస్తోందని.. కేటీఆర్ కు పేపర్ దొంగలు సమాచారం ఇచ్చారా మరి ? అని నిలదీశారు. కేటీఆర్ ఏమి చెబుతున్నారో సిట్ అదే చేస్తుందని..అసలు కేటీఆర్ కు పరువు ఉందా ? లేదా తేలాలి ? అని నిలదీశారు. తెలంగాణ పరువును నడి బజారులో అమ్మిన సన్నాసి కేటీఆర్ నాకు నోటీసు ఇస్తాడా ,? అని ఆగ్రహించారు. వంద కోట్ల ఇస్తే …కేటీఆర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా ? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.కేటీఆర్ నీచుడు … సన్నాసి …నాకు నోటీసు ఇచ్చేది ఎంది ? దమ్ముంటే పేపర్ లీకు కేసు ను సిబిఐకి ,ఈడి కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.