ఏప్రిల్ 8న ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత ప్రారంభం

-

భాగ్యనగర వాసులకు శుభవార్త. మరో వారం రోజుల్లో నగరంలోని ఏ ప్రాంతం నుంచి మేడ్చల్ వెళ్లాలన్నా.. మేడ్చల్ నుంచి ఏ మూలకైనా వెళ్లడానికి ఇక కష్టపడనక్కర్లేదు. ఎందుకంటే ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. లక్షలాది ప్రజల సంవత్సరాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఎంఎంటీఎస్‌ ఎక్కి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం సైతం కేవలం రూ.10-15 టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు.

ఈ నెల 8న ప్రధానమంత్రి ఎంఎంటీఎస్‌ రెండోదశను లాంఛనంగా ప్రారంభించి మేడ్చల్‌-సికింద్రాబాద్‌-ఉందానగర్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌-తెల్లాపూర్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం ఏకే గుప్తా చెప్పారు.

మేడ్చల్‌-ఉందానగర్‌ 55 కిలోమీటర్ల దూరం ఉంది. మేడ్చల్‌ వైపు నుంచి వచ్చేవారు గతంలో సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌లో వెళ్తుండేవారు. మేడ్చల్‌ నుంచి లింగంపల్లికి 52 కిలోమీటర్ల ప్రయాణానికి రెండు, మూడు గంటలు పట్టేది. ఇప్పుడు ఎంఎంటీఎస్‌ రెండోదశలో భాగంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు పరుగులు పెడితే కేవలం గంటలో ప్రశాంతంగా చేరుకోవచ్చు. మేడ్చల్‌-తెల్లాపూర్‌ మధ్య సికింద్రాబాద్‌ మీదుగా రైళ్లు నడిపించాల్సి ఉంది. అలాగే మేడ్చల్‌-ఉందానగర్‌ మధ్య సికింద్రాబాద్‌ మీదుగా కొనసాగాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news