నాలుగు రోజుల్లో 73 మంది మృతి.. ఎందుకో తెలుసా..?

-

కుండపోత వర్షాలతో ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ విలవిల్లాడుతుంది. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. వరద తాకిడికి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల్లో 73 మంది మరణించారు. గోడలు కూలడం, పాము కాట్లు, వరదల్లో కొట్టుకుపోవడం, పిడుగు పాటు వంటి ఘటనల కారణంగా ఈ మరణాలు సంభవించాయని విపత్తు నిర్వహణాధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ వారం రోజుల్లో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

లక్నో, అమేథీ, హార్దోరు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తూర్పు ఉత్తర్‌ ప్రదేశ్‌లో పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాగరాజ్‌, వారణాసి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవడంతో సాధారణ జనజీవనానికి విఘాతం కలిగింది. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా మేజిస్ర్టేట్‌లను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ 4 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news