తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన బండి సంజయ్ ను ఈ రోజు ఉదయం తమ నివాసంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఉన్న బండి సంజయ్ ను విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తలు , ప్రజాప్రతినిధులు తమ ఆందోళన తెలియచేస్తున్నారు. ఈ అంశంపై ఇటు పార్టీల నేతలు కామెంట్ ల వర్షం కురిపించుకుంటున్నారు. ఇక ఉదయం నుండి ఏమి జరుగుతుందో తెలియని బండి సంజయ్ తనను అరెస్ట్ చేయడంపై చాలా కోపంగా ఉన్నారని బీజేపీ వాళ్ళు చెబుతున్నారు .
అంతే కాకుండా ఉదయం నుండి భోజనం కూడా చేయకుండా ఎందుకు నన్ను అరెస్ట్ చేసారంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు బండి సంజయ్ ను ఈ రోజు హన్మకొండ కోర్ట్ లో హాజరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ జరుగుతుండగా ఇంకాసేపట్లో మేజిస్ట్రేట్ తీర్పును ప్రకటిస్తారు. మరి కోర్ట్ విచారణ అనంతరం బండి సంజయ్ ను రిలీజ్ చేస్తారా లేదా అసలు విషయం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.