ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా సికిందరాబాద్ మరియు తిరుపతి మధ్యన వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలుగులో మాట్లాడారు. దీనితో అక్కడ ఉన్నవారు మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ మోదీ షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఈ భాగ్యనగరాన్ని వేంకటేశ్వరస్వామి నగరంతో కలిపినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రూ. 11 వేల కోట్లను కేటాయించి అభివృద్ధి చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.
ఈ అవకాశం ప్రజలు నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. మరి ఈ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అన్నది ముందు ముందు చూడాలి. ఇంకా తెలంగాణ ప్రభుత్వం పాలన గురించి మరియు వారి విధానాల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.