‘స్పెషల్ పర్సన్​’ను ఫ్యాన్స్​కి పరిచయం చేసిన డైరెక్టర్ మారుతీ

-

డైరెక్టర్ మారుతీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బస్టాప్, భలేభలేమగాడివోయ్ వంటి సినిమాలతో తనకంటూ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​తో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ డైరెక్టర్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ తన సినిమాలు, ఆలోచనలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా మారుతీ.. తన జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?

‘‘’ఈ ఫొటోల్లోని వ్యక్తి పేరు సీతారామ రావు. మా సొంత ఊరు మచిలీపట్నంలో పనిచేసే బార్బర్‌. ఆయన వయసు వందేళ్లు. ఇంకా చురుకుగా రోజూ తన షాపుకు వచ్చి ఎంతోమందికి హైయిర్‌ కట్‌ చేస్తుంటారు. ఆయనకు తన వృత్తి అంటే చాలా గౌరవం. మా ఇంట్లో మా తాతయ్యకు, మా నాన్నకు ఇప్పుడు నాకు ఇలా మూడు తరాల వారికి ఆయనే హైయిర్‌ కట్‌ చేస్తున్నారు. ఇలాంటి వారు ఎంతోమందికి స్ఫూర్తి. మీరు ఆరోగ్యంగా ఉండాలి సీతారామ రావు గారు’’’ అంటూ ఆయనతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్టు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘గ్రేట్‌ పర్సన్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news