OTT: ఉపేంద్ర కబ్జా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..!!

-

కన్నడలో మంచి పాపులారిటీ సంపాదించిన నటుడు ఉపేంద్ర చాలా కాలం తర్వాత వెండితెర పైన కనిపించిన చిత్రం కబ్జా.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో మరొక నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటించారు. హీరోయిన్గా శ్రీయ నటించింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కించిన ఈ చిత్రం డైరెక్టర్ ఆర్ చంద్రు దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత నెల 17వ తేదీన చాలా గ్రాండ్గా విడుదలయ్యింది.

అయితే ఈ సినిమా గతంలో విడుదలైన కే జి ఎఫ్ సినిమాను పోలి ఉండడంతో కబ్జా సినిమాకు కాస్త మైనస్ గా మారిందని చెప్పవచ్చు. దీంతో థియేటర్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే నష్టాలను మిగిల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఉపేంద్ర సిల్వర్ స్క్రీన్ పైన కనిపించడం తోపాటు సినిమాలోని కొన్ని ఎలివేషన్ సీన్లు అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటి లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

కబ్జా సినిమా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఈనెల 14వ తేదీ నుంచి స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సుమారుగా రూ .110 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల అయి ఇప్పటికి 25 రోజులు కావస్తున్న అంతలోనే ఓటీటి లో స్ట్రీమింగ్ కావడం జరుగుతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news