మహిళలు, పసిడి ప్రియులకు షాక్. భారత్లో బంగారం ధర జీవిత కాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పది గ్రాముల పసిడి ధర ప్రస్తుతం రూ.62,780గా ఉంది. కిలో వెండి ధర కుడా భారీగా పెరిగింది. ప్రస్తుతం రూ.78,780 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.62,780 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.78,780 రూపాయలుగా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,780 గా ఉంది. కిలో వెండి ధర రూ.78,780 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,780 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.78,780గా ఉంది.
- ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,780గా ఉంది. కేజీ వెండి ధర రూ.78,780 వద్ద ఉంది.
దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.480 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.61,780కు చేరుకుంది. వెండి కూడా కిలో రూ.410 పెరిగి రూ.77,580కి చేరుకుంది.