చార్జింగ్ ఆధారంగా ఉబెర్ రేట్ల పెంపు….?

-

ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ తక్కువ చార్జింగ్‌ ఉన్న ఫోన్లలో ఎక్కువ ధర చూపిస్తోందంటూ బెల్జియంకు చెందిన డిర్నియర్ హ్యూయరీ వార్తాపత్రిక ఓ సంచలన కథనం ప్రచురించింది. చార్జింగ్ ఆధారంగా రేట్ల పెంపు ఆరోపణలపై తాము చేపట్టిన దర్యాప్తులో ఈ విషయం రుజువైందని ఆ వార్తాపత్రిక పేర్కొంది. 84 శాతం చార్జింగ్ ఉన్న ఫోన్ కంటే 12 శాతం ఉన్న ఫోన్లోంచి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు ఒకే దూరానికి రూ.100 (మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) మేర ధర అధికంగా ఉన్నట్టు పేర్కొంది. అయితే.. ఉబెర్ మాత్రం ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

uber accused of increasing prices when users phone battery is low

ఆ ప్రాంతంలో క్యాబ్‌లకు ఉన్న డిమాండ్‌లను బట్టే ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు జరుగుతాయని, దీన్నే డైనమిక్ ప్రైసింగ్ విధానమని అంటారని వివరించింది. ఇదిలా ఉంటే, వినియోగదారులు తమ ఫోన్ చార్జింగ్ తక్కువగా ఉన్న సందర్భాల్లో అధిక ధరలు చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్టు తాము గుర్తించామని 2019 నాటి ఓ ఇంటర్వ్యూలో ఉబెర్ ఆర్థిక పరిశోధన విభాగం మాజీ అధపతి కీత్ చెన్ తెలిపారు. మీరు యాప్‌లో క్యాబ్ బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకోండి. ఇంతలో ఫోన్‌లో చార్జింగ్ అయిపోవచ్చింది. మరోవైపు, క్యాబ్ రేట్‌ రోజూకంటే కాస్త పెరిగినట్టు అనిపించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news