వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్..వైసీపీ పార్టీ కీలక నిర్ణయం

-

కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ. భాస్కర్‌ రెడ్డి సహా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగానే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ. ఉ.5.30 గంటల సమయంలో భాస్కర్‌ రెడ్డి ఇంట్లోకి సీబీఐ బృందం.. ఉ.6.10 నుంచి భాస్కర్‌ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించింది.

తర్వాత భాస్కర్‌ రెడ్డి ఇంట్లోకి ఎవరినీ అనుమతించని సీబీఐ.. భాస్కర్‌ రెడ్డి ఇంట్లోనే అరెస్ట్‌ మెమో సిద్ధం చేసింది. అయితే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ పై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పులివెందులలో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చింది వైసిపి. పులివెందుల వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జి వైఎస్ భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఉదయం 9:30 లకు పులివెందుల పాత బస్టాండ్ నుంచి పూల అంగళ్ళ వరకు శాంతియుత నిరసన ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు వైసిపి నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news