హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్…ఎంఎంటీఎస్ సర్వీసుల విస్తరణ

-

దక్షిణ మధ్య రైల్వే తాజాగా హైదరాబాద్ నగరవాసులకు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ప్రజాదరణ పొందిన ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను విస్తరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో అదనంగా 40 ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచింది. సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య కొత్తగా 20 ఎంఎంటీఎస్ సర్వీసులు పరుగులు పెట్టనుండగా ఫలక్‌నుమా-ఉందానగర్ మధ్య మరో 20 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించింది. గతంలో సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా వెళ్లే ఎంఎంటీఎస్ రైళ్లు ఉందానగర్ వరకూ సేవలందించనున్నాయి. దీంతో, జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య 106కి చేరింది.

 

MMTS services extended

 

Read more RELATED
Recommended to you

Latest news