తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి విపరీతంగా ఎండలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపింది.
ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C (డిగ్రీల సెంటీగ్రేడ్) మధ్యన అనేక చోట్ల, రేపు 40°C నుండి 42°C ( కొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. 21వ తేదీ నుండి అంటే రేపటి నుంచే 4,5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి అనేక చోట్ల 40°C కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
GHMC పరిధిలో 21వ తేదీ నుండి 35°C నుండి 37°C మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.