రాకెట్ ఎఫెక్ట్.. ఎలాన్ మస్క్‌కు ఒక్కరోజే రూ.లక్ష కోట్లు నష్టం

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక్కరోజులోనే 1300 కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు. టెస్లా అమ్మకాలు మందగించడం, స్పేస్ఎక్స్ రాకెట్ పేలిపోవడం, ట్విటర్ బ్లూటిక్ వైఫల్యాలు వంటి వరుస నిరాశాజనక పరిణామాల మధ్య ఆయన కంపెనీల షేర్లు భారీ కుదుపునకు గురయ్యాయి. 24 గంటల వ్యవధిలో 13 బిలియన్ డాలర్లు కోల్పోయారు. భారత కరెన్సీలో చెప్పాలంటే ఇది రూ.లక్ష కోట్లకు పైమాటే. ఈ ఏడాది ఆయన కోల్పోయిన అత్యధిక మొత్తం ఇదే.

బ్లూమ్​బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ఎలాన్ మస్క్ ప్రస్తుత సంపద 164 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ‘లూయీ విటాన్’ అధినేత బెర్నాల్డ్ ఆర్నాల్ట్.. తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

టెస్లా సంస్థ తొలి త్రైమాసికం ఫలితాల్లో దారుణ ప్రదర్శన చేసింది. 2023 తొలి త్రైమాసికంలో టెస్లా లాభం 2.51 బిలియన్లకు పరిమితమైందని కంపెనీ తన ఫైలింగ్​లో తెలిపింది. ఇది గతేడాది లాభంతో పోలిస్తే 24 శాతం తక్కువ. సంస్థ రాబడి సైతం 20 శాతం పడిపోయింది. ఈ ప్రభావం ఆ సంస్థ షేర్లపై పడింది.

Read more RELATED
Recommended to you

Latest news