LookBack 2024 : బడ్జెట్ లో వినియోగదారులను ఆకట్టుకున్న స్మార్ట్ ఫోన్లు ఇవే..

-

2024 సంవత్సరంలో పర్ఫామెన్స్ పరంగా ధర పరంగా వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించిన కొన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మంచి స్పెసిఫికేషన్స్ తో పాటు ఆకర్షణీయమైన ఆకారం కలిగిన స్మార్ట్ ఫోన్లు 10వేల కన్నా తక్కువ ధరల్లో వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

షియోమీ రెడ్ మీ 10A

6.53 అంగుళాల హెచ్‍డీ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంది.
5జి సపోర్ట్ తో పాటు 3gb, 4gb ర్యామ్ వేరియంట్లను కలిగి ఉంది. 13 MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా కలిగిన ఫోన్ ధర రూపాయలు 6999 నుండి మొదలవుతుంది.

రియల్ మీ C35 :

6.6 అంగుళాల ఫుల్ హెచ్‍డీ ప్లస్ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ని కలిగి ఉంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి, 64 జిబి 128gb స్టోరేజ్ సామర్ధ్యంతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీని ధర రూపాయలు 8951 నుంచి మొదలవుతుంది.

సాంసంగ్ గెలాక్సీ M04:

6.5 అంగుళాల హెచ్‍డి డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ 13 MP డ్యుయల్ కెమెరా సెటప్ ని కలిగి ఉంది. 5000 mAh బ్యాటరీ సామర్ధ్యంతో, మీడియా టెక్ హీలియో P35 ప్రాసెసర్ ని కలిగి ఉంది. దీని ధర రూపాయలు 8899 నుండి మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news