బీసీ కులగణన పై బీజేపీ వైఖరి చెప్పాలి : ఎమ్మెల్సీ కవిత

-

బీసీలు అంటే బీజేపీకి లెక్కలేదా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తాజాగా ఆరెకటిక, శాలివాహన సంఘం నేతలు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో ఆరె కటిక, శాలివాహన సంఘం నేతలు తన నివాసంలో కలిశారు. కుల వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని స్పష్టం చేశారు. కేసీఆర్ కుల వృత్తులకు అన్ని విధాలుగా మద్దతిచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తోందన్నారు. 

ముఖ్యంగా బీసీల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నా.. బీజేపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీసీలు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కావడం బీజేపీకి ఇస్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news