సింగరేణిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్‌కు ఈటల ఛాలెంజ్

-

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేంద్రంపై పదే పదే విషం చిమ్ముతోందని ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే ఆలోచన తమకు లేదని రామగుండం గడ్డ మీద నుంచి ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సింగరేణి విధి విధానాలపై కేంద్రం జోక్యం చేసుకోవట్లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికే ఆ నిర్ణయాన్ని వదిలేసిందని చెప్పారు. సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని.. తేదీ, సమయం చెబితే చర్చకు వస్తానని బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసిరారు.

‘‘బొగ్గు గనులకు దరఖాస్తు చేసుకోకుండా కేంద్రంపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. సింగరేణిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. సింగరేణిలో మూడు గనులు ప్రైవేట్‌కి ఇచ్చి తవ్విస్తున్నది నిజం కాదా? ₹20కోట్ల బకాయిలు సింగరేణికి ఎందుకివ్వడం లేదు? విశాఖ గురించి ఆలోచిస్తున్న కేసీఆర్‌.. ముందు రాష్ట్రానికి న్యాయం చేయాలి. ఆర్టీసీ, నిజాం షుగర్‌, అజాంజాహి మిల్లు తెలంగాణవి కాదా? కేసీఆర్ సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సింగరేణి ప్రైవేట్ పరం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ’’ అని ఈటల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news