ఏటీఎం నుండి చిరిగిన నోట్లు కానీ నకిలీ నోట్లు కానీ వస్తే ఏం చెయ్యాలి..?

-

fake notes: చాలామంది క్యాష్ ఎక్కువ తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. అవసరం ఉంటే ఏటీఎం కి వెళ్లి డ్రా చేస్తూ ఉంటారు. మీరు కూడా అవసరం వచ్చినప్పుడు ఏటీఎం నుండి డబ్బులు తీసుకుంటూ ఉంటారా అయితే ఏటీఎంలో ఒక్కొక్కసారి డామేజ్ అయిన నోట్లు నకిలీ నోట్లు రావచ్చు అలాంటి సమయంలో కస్టమర్లకి కాస్త ఆందోళన కలుగుతుంది. చిరిగిపోయిన నోట్లు చెల్లవు నకిలీ నోట్లు కూడా చెల్లవు అలాంటప్పుడు ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఉందా అయితే వెంటనే క్లియర్ చేసేసుకోండి.

fake notes
fake notes

 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడే చూసేద్దాం.. ఏటీఎం నుండి ఒకవేళ చిరిగిపోయిన నోట్లు కానీ నకిలీ నోట్లు కానీ వచ్చాయి అంటే కస్టమర్లు నష్టపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది ఏటీఎంలో చిరిగిపోయిన నోట్లు కానీ నకిలీ నోట్లు కానీ వస్తే వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసుకొని కొత్త నోట్లు ఇవ్వాలని ఆర్బీఐ చెప్పింది. బ్యాంకు కి తీసుకు వెళ్లిన తర్వాత వాటిని తీసుకుని మీకు కొత్త నోట్ల ని ఇచ్చేస్తారు.

చిరిగిన నోట్లు ఏటీఎం నుండి వస్తే వాటిని తీసుకోవడానికి బ్యాంకులు నిరాకరించకూడదని ఆర్బిఐ చెప్పింది 2016 జూలైలోనే దీనికి సంబంధించిన ఒక సర్కిలర్ ని జారీ చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు కనుక కస్టమర్లు తీసుకువచ్చిన నోట్లని నిరాకరిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని సర్కిల్ ద్వారా స్పష్టం చేస్తుంది. ఆర్బీఐ ఏటీఎం నుండి చిరిగిన నోట్లు నకిలీ నోట్లో వస్తుంటే ఆ బాధ్యత బ్యాంకులది అని చెప్పింది అలాంటి నోట్ల ని మార్చుకునే బాధ్యత కూడా బ్యాంకుదేనని చెప్పింది.

ఏటీఎం కి వెళ్లి డబ్బులు తీసేటప్పుడు నకిలీ నోట్లు వస్తే వాటిని మీరు గుర్తించాలి. నోట్ల నాణ్యత వాటి సీరియల్ నెంబర్ వాటర్ మార్క్ గవర్నర్ సంతకం సెక్యూరిటీ త్రెడ్ వంటివి చెక్ చేయండి. వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా అది దొంగ నోటుగా భావించాలి నకిలీ నోట్ల ని బ్యాంకుకు తీసుకువెళ్లి మార్చుకోండి చిరిగిన నోట్లు కానీ నకిలీ నోట్లు కానీ వస్తే వాటిని తీసుకెళ్లాలి. అటువంటి నోట్లు వచ్చినట్లు అప్లికేషన్ రాయాలి ఏ రోజు ఏ సమయంలో ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేశారనేది మీరు చెప్పాలి, ఇలా వివరాలను ఇస్తే బ్యాంకులు మారుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news