అక్షయ తృతీయ నాడు ఈ తప్పులని అస్సలు చెయ్యకండి..!

-

lakshmi devi: బంగారాన్ని అక్షయ తృతీయ రోజు కొంటే మంచి జరుగుతుందని అక్షయమవుతుందని అంటారు. అందుకని మంచి పనులుని ఆ రోజు చేస్తారు ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 22 శనివారం నాడు వచ్చింది. ఈ రోజున లక్ష్మీ దేవి ప్రసన్నం అవ్వాలని బంగారం వెండి కొంటారు అయితే అక్షయ తృతీయ నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు..?, ఏ విధంగా అనుసరిస్తే మంచిది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..

 Lakshmi devi
Lakshmi devi

అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవి లేదంటే సంపద మీ ఇంటికి వస్తే.. అప్పుడు అది ఎక్కువ అవుతూనే ఉంటుంది క్షీణత ఎప్పుడూ ఉండదు. అక్షయ తృతీయ రోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి లేకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం కలగొచ్చు. దీని కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అక్షయ తృతీయ నాడు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తే.. తప్పనిసరిగా ఇంటికి తీసుకురావాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది దాని వలన ఆమె అనుగ్రహం మీకు కలుగుతుంది. ఒకవేళ కనుక వాటిని కొనుగోలు చేయకపోయినట్లయితే మీ రాశి బట్టి మీరు శుభ లోహాన్ని కొనొచ్చు ఇది కూడా లక్ష్మీదేవిని కలిగేలా చేస్తుంది. అక్షయ తృతీయనాడు బార్లీ ని కొనుగోలు చేస్తే కూడా మంచిది ఇది ఆనందాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుంది.

అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవినే కాదు విష్ణుమూర్తి ని కూడా పూజించండి. ఆర్థిక బాధల నుండి బయటపడడానికి అవుతుంది. పూజ లో తులసి ని ఉపయోగించవద్దు. ఇది లక్ష్మీదేవికి అగ్రహాన్ని కలిగించవచ్చు. అలానే లక్ష్మిని పొందడం కోసం మీరు మీ లాకర్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు కూడా ఇవ్వకూడదు ఈ తప్పులను అస్సలు చేయకండి.

Read more RELATED
Recommended to you

Latest news