ఐపిఎల్ 2023: చోరీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కిట్ లు దొరికాయి… !

-

ఐపిఎల్ సీజన్ 16 లో భాగంగా మూడు వారాల నుండి మ్యాచ్ లో హోరా హోరీగా జరుగుతున్నాయి. గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ మళ్లీ టైటిల్ కొట్టాలని కసిగా ఆడుతోంది, అదే విధంగా రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో జట్లు టైటిల్ పోటీలో నిలుస్తున్నాయి. కాగా తాజాగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కు సంబంధించిన బ్యాట్ లు మరియు కిట్ బ్యాగ్ లు దొంగతనానికి గురయ్యాయి. ఈ విషయం పట్ల ఢిల్లీ జట్టు యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది.

ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీస్ లు విచారణ చేపట్టగా… చివరికి ఈ రోజు కాసేపటి క్రితం బ్యాట్ లు మరియు కిట్ లు స్వాధీనం చేసుకున్నారు. ఇంత త్వరగా స్పందించి కేసును ఛేదించినందుకు ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదములు చెప్పారు. కాగా పోయిన కిట్లు మరియు బ్యాట్ లలో ఇంకా కొన్ని దొరకాల్సి ఉందని తెలిపారు. కాగా నిన్న రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయాన్ని సాధించి.. ఆరు మ్యాచ్ లలో ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లు సాధించి ఆఖరి స్థానంలోనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news