ఈ రోజు ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ధోనీ నాయకత్వంలో చెన్నై టీమ్ 5 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ లలో గెలిచి రెండు మ్యాచ్ లలో మాత్రమే ఓడింది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఆడిన 5 మ్యాచ్ లలో కేవలం 2 మ్యాచ్ లలో నెగ్గి.. మూడింట ఓడింది. ప్రస్తుతం చెన్నై పాయింట్ల పట్టీకలో 3 వ స్థానంలో మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వ స్థానంలో ఉంది. ఇక ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో పూర్తిగా ఫేవరెట్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అని ఎవ్వరైనా చెప్పగలరు.
అయితే సన్ రైజర్స్ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతారు అన్నది ఎవ్వరూ ఊహించలేము. ఒక్కో సారి ఒక్కో విధంగా అంచనాలు తారుమారు అయ్యేలా ఆడుతుంది. సన్ రైజర్స్ విజయావకాశాలు ఎక్కువగా ఓపెనర్లు ప్రదర్శన మీదనే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ పవర్ ప్లే లో వీలైనన్ని పరుగులు చేస్తే తర్వాత వచ్చే ఆటగాళ్ళ పైన ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఇక బౌలర్ల పరంగా సమస్య లేకున్నా కీలక సమయంలో వికెట్లు తీయగలిగితే గెలిచే ఛాన్స్ ఉంటాయి. ఇప్పటికే చెన్నై మంచి ఊపుమీద ఉంది. గత మ్యాచ్ లో బెంగళూర్ పై ఉత్కంఠగా గెలిచి మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. మరి ఫుల్ జోష్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్డుకుంటుందా చూడాలి.