‘అమ్మ చెప్పింది’ అంటూ.. లైఫ్ లెస్సన్ చెప్పిన ఓయో సీఈవో

-

జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వ్యక్తులు వారి అనుభవాల గురించి చెప్పే ప్రతి మాట నేటి యువతకు ఆదర్శమే. అందుకే టెడ్ టాక్, మోటివేషనల్ స్పీచ్​కు నేటి తరంలోనూ క్రేజ్ ఎక్కువ. యువతలో ఆ స్ఫూర్తిని నింపేందుకు కొన్ని కళాశాలలు అప్పుడప్పుడు కొందరు ప్రముఖులను గెస్టులుగా పిలిచి మోటివేట్ చేయిస్తూ ఉంటారు. అలా ఐఐఎం నాగపుర్​ కాలేజ్​కు వెళ్లిన ఓయో సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ తన జీవిత పాఠాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఇంతకీ అదేంటంటే..?

‘నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను ఇటీవల ఐఐఎం నాగ్‌పుర్ విద్యార్థులతో పంచుకునే అవకాశం దక్కింది’ అంటూ విద్యార్థులతో మాట్లాడిన వీడియోను రితేశ్‌ షేర్ చేశారు. ‘మీరు ఉన్నతస్థానాలకు చేరుకునే క్రమంలో మీ మూలాలను మర్చిపోవద్దు. జీవితంలో ఎంతగా పైకెదిగితే.. అంతగా ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మదగ్గర విన్నాను. మీరు జీవితంలో ఎదుగుతున్నప్పుడు.. మీరు ఇప్పుడు ఏం సాధించారు, రెండేళ్ల క్రితం ఎలా ఉండేవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ ప్రతిభతో పెద్ద వ్యాపారాలను నిర్మించాలనే సంకల్పాన్ని వీడనట్లే.. మీ మూలాలను కూడా మర్చిపోకూడదు’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news