జగన్ కుటుంబ సభ్యులపై పట్టాభి మాట్లాడితే నాలుక కోస్తాం – వైసీపీ ఎమ్మెల్సీ

-

జగన్ కుటుంబ సభ్యులపై పట్టాభి మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. ఇవాళ ప్రెస్‌ మీట్‌ పెట్టిన పట్టాభి.. జగన్‌ కుటుంబంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే… దీనిపై వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పందించారు.

దళిత జాతికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబు ఎక్కడికెళ్లినా నిరసనలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు అన్ని డైవెర్షన్ పొలిటిక్స్ చేస్తాడని.. చంద్రబాబు చేసే చీప్ పాలిటిక్స్ అందరికి తెలుసు అని వివరించారు. జగన్ కుటుంబ సభ్యుల పై పట్టాభి మాట్లాడితే నాలుక కోస్తామని వార్నింగ్‌ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. నోటికి ఏది వస్తే అది మాట్లాడ్డం మంచిది కాదు పట్టాభి… దళిత జాతికి చంద్రబాబు మోసం తెలిసి పోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news