నా మీద పడితే ఊరుకోవాలా.. అందుకే కొట్టా : వైఎస్ షర్మిల

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులతో జరిగిన వాగ్వాదంలో షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్​ను నెట్టేయడమే గాక.. ఎస్సైపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై షర్మిల స్పందించారు. ‘నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నా మీద పడితే నేను భరించాలా..? నా రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు..? అని షర్మిల ప్రశ్నించారు.

‘ఒంటరిగానే సిట్‌ కార్యాలయానికి వెళ్తుంటే అడ్డుకున్నారు. పేపర్‌ లీకేజ్‌ దర్యాప్తుపై వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నా. సిట్‌ కార్యాలయానికి వెళ్లేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను ధర్నాకు పోలేదు, ముట్టడికి పిలుపు ఇవ్వలేదు. నా ఇంటిచుట్టూ వందలాది పోలీసుల పహారా ఎందుకు? పోలీసులే నాపట్ల దురుసుగా ప్రవర్తించారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారు.’ అని షర్మిల ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news