టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి విడదల రజిని. ఆదివారం రోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన చింతమనేని.. ప్రభుత్వ ఆసుపత్రి బర్నింగ్ వార్డులో ఏసీలు పనిచేయకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మీ మంత్రిగారు మేకప్ వేసుకొని తిరుగుతున్నారా” అంటూ మంత్రి విడుదల రజినిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అయితే చింతమనేని చేసిన వ్యాఖ్యలకి నేడు కౌంటర్ ఇచ్చారు మంత్రి. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించిన ఆమె.. రాజమండ్రిలో జరుగుతున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. చింతమనేనికి మహిళల పట్ల గౌరవం లేదని, తాసిల్దార్ వనజాక్షి పట్ల ఏ విధంగా వ్యవహరించారో అంతా చూసామని అన్నారు. మేకప్ వేసుకుని తిరుగుతున్న నేను హాస్పిటల్లను పట్టించుకోవడంలేదని విమర్శించడం టిడిపి నేతలకు తగదని అన్నారు మంత్రి. చింతమనేని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.