నేడు రాష్ట్ర వ్యాప్తంగా BRS ప్రతినిధుల సభలు

-

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ మినీ ప్లీనరీలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, మేయర్లు, ఛైర్మన్లు తదితర ముఖ్య నేతలు సహా దాదాపు మూడువేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఉదయమే నగరం, పట్టణం, గ్రామమంతటా పార్టీ జెండాలను ఎగరవేయనున్నారు. ఉదయం పది గంటలకల్లా నాయకులు, కార్యకర్తలు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉద్యమ కాలం నుంచి రాష్ట్రావిర్భావం తర్వాత తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై సభల్లో లోతుగా చర్చిస్తారు.

ప్రతినిధుల సభల్లో కనీసం ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా, ఇంటింటికీ మంచినీరు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి ప్రజలకు వివరించడంతోపాటు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందనే చర్చను సభల్లో ప్రధానంగా చేపట్టనున్నారు.

ఈనెల 27న పార్టీన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నారు. భారాస అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిస్థితులపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news