వివేకా హత్య కేసులో సునీత ప్రమేయం లేదు : సుప్రీం కోర్టు

-

వైఎస్ఎస్‌ వివేకా హత్యలో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాలను సుప్రీంకోర్టు సోమవారం తాను జారీ చేసిన ఉత్తర్వుల్లో పొందుపరిచింది. ఇటీవల వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ సమయంలో సమర్పించిన రిమాండ్‌ నివేదికలోని అంశాలనూ ప్రస్తావించింది. ఇంతకీ అవేంటంటే..?

అవినాష్‌రెడ్డి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డి వివేకానందరెడ్డి హత్య, తదనంతరం సాక్ష్యాల చెరిపివేత కుట్రలో పాలుపంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాక్ష్యాల చెరిపివేతలో ఎర్రగంగిరెడ్డి క్రియాశీలకంగా పాల్గొనడంతోపాటు, సాక్షి అయిన వాచ్‌మన్‌ రంగన్నను బెదిరించినట్లు తేలింది. అందువల్ల 2022 జనవరి 31న దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో డి.శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి పేర్లు చేర్చారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాత్ర గురించి దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇతరుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఆయన పాత్ర గురించి సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందించాం. దానిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

‘అవినాష్‌రెడ్డి, ఇతరులు వివేకానందరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బెడ్‌రూంలో రక్తం, బాత్‌రూమ్‌లో తలపై అత్యంత భయంకరమైన గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని చూశారు. వెంటనే అవినాష్‌రెడ్డి తన పీఏ రాఘవరెడ్డి ఫోన్‌ ద్వారా సీఐ శంకరయ్యకు కాల్‌ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులతో చనిపోయాడని చెప్పారు. కుట్రపూరితంగా హత్యకు గురైన వ్యక్తి సాధారణంగా చనిపోయాడని కట్టుకథ అల్లడానికి ప్రయత్నించినట్లు దీనిద్వారా తెలుస్తోంది.’ అని సుప్రీం కోర్టు ప్రస్తావించింది.

Read more RELATED
Recommended to you

Latest news