ఈరోజుల్లో చాలా మంది ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులని పెడుతున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత మొత్తం పొదుపు చెయ్యాలని చూస్తూ వుంటారు. మార్కెట్లో ఎన్నో రకాల పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. రిస్క్ లేకుండా రాబడి ఈ పథకాల తో వస్తుంది. బ్యాంక్‌లు అందించే ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్టాఫీస్‌లు ఇచ్చే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాయి. పోస్టాఫీస్ తీసుకొచ్చిన స్కీమ్స్ లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. నిర్దిష్ట సమయం తరువాత డబ్బులు రెట్టింపు అవుతాయి.
ఇటీవల వికాస్ పత్ర పథకం వడ్డీ రేటును పెంచారు. పెరిగిన రేటు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో ఈ వడ్డీ రేటు 7.5 శాతానికి చేరింది. ఫిక్స్డ్ టైమ్ తర్వాత డబ్బులు రెట్టింపు అవుతాయి. ఈ స్కీములో డబ్బులు పెడితే 115 నెలల్లోనే (9 సంవత్సరాల 7 నెలలు) పెట్టుబడి రెట్టింపు అవుతుంది. కేవీపీలో రూ.10 లక్షలు పెట్టుబడి 15 నెలల్లోనే రూ.20 లక్షలు పొందవచ్చు. కనీసం రూ.1000తో అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. గరిష్ట డిపాజిట్‌పై పరిమితి లేదు.
సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ గా అయినా అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్‌ను తెరవచ్చు. కావాలంటే మైనర్ పేరుతో గార్డియన్ అయినా సరే ఈ అకౌంట్ తీసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ వరకు ఆగాల్సి వుంది. స్కీమ్ మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాతనే డబ్బులు రెట్టింపు అవుతుంది. ఒకవేళ మీరు మధ్యలో విత్‌డ్రా చేస్తే అశించిన స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 2 ఏళ్ల 6 నెలల తర్వాత మాత్రమే ఖాతా ని క్లోజ్ చేయడానికి అవుతుంది.