వరల్డ్​ లార్జెస్ట్​ స్క్రీన్​పై NTR సినిమా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

-

టాలీవుడ్​లో ప్రస్తుతం ట్రెండ్ అంతా రీ రిలీజ్​లదే. ఇప్పటికే అగ్ర హీరోల సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు రీ రిలీజ్ అయి అంతే స్థాయి హిట్ అందుకున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ కూడా రీ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా రీరిలీజ్ చేస్తున్నారు.

అక్కడి మెల్​బోర్న్​ సిటీలోని ఐమాక్స్​ థియేటర్​లో మే 20వ తేదీన ఈ మూవీని​ రీరిలీజ్ చేస్తున్నారు. ఈ ఐమాక్స్ ​ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్​ ఉన్న థియేటర్​గా ప్రత్యేక గుర్తింపు కూడా పొందింది. తాజాగా సోమవారం ఈ థియేటర్​లో ‘సింహాద్రి’​ బుకింగ్స్​ను ఓపెన్​ చేశారు. బుకింగ్స్​ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే టిక్కెట్లన్నీ హాట్​ కేకుల్లా అమ్ముడుపోయినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలోనూ తారక్​కు ఈ విధమైన రెస్పాన్స్​ రావడం.. అది కూడా రీ రిలీజ్ అవుతున్న సినిమాకు ఈ రకంగా క్రేజ్ దక్కడం చూస్తుంటే ఇంటర్నేషనల్ లెవెల్​లో తారక్​కు ఎంత పాపులారిటీ ఉందో అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news