నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తామని ప్రకటించారు జోగి రమేష్. వైసీపీ నాయీ బ్రాహ్మణుల కృతఙ్ఞతాసదస్సులో పాల్గొన్న జోగి రమేష్.. మాట్లాడుతూ, బీసీలకు సీఎం జగన్ అన్ని విధాలా అండగా నిలిచారని.. బీసీలలో ఎన్ని కులాలు ఉంటాయో కూడా తెలియని మనకి రాజకీయంగా నిలబెట్టారని వివరించారు. నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభలో అడుగు పెట్టేలా చేస్తాడని.. అది త్వరలోనే జరుగుతుందన్నారు.
సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాలు చూశారని.. అందుకే అనేక సంక్షేమ పథకాలు తెచ్చి అండగా నిలిచారని వెల్లడించారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని..చంద్రబాబుకు బీసీలంటే చిన్నచూపని చెప్పారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారు.. ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు, కంబళ్లు ఇచ్చి ఇక మీకు చాల్లే అంటాడని వివరించారు. జగన్ వలన మన పిల్లలు నేడు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు.. ఆలయాల పాలక మండలిలో సైతం నాయీ బ్రాహ్మణులు సభ్యులయ్యారన్నారు జోగి రమేష్.