అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కేంద్రం కూడా నష్టపరిహారం ఇవ్వాలి – ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

-

రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షానికి వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఐకెపి కేంద్రాలలో వర్షపు నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే రైతులకు మద్దతుగా నేడు ధర్నాలో పాల్గొన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విధంగా కేంద్రం కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

30వేల రూపాయలు ప్రతి ఎకరాకు కేంద్ర విపత్తు నుండి ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. రాజకీయం కోసం కాదు రైతన్నలను ఆదుకోవడం కోసం ధర్నాలో పాల్గొన్నానని స్పష్టం చేశారు. స్వయంగా ధర్నా, ఆందోళన నిర్వహించానన్నారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,రేవంత్ రెడ్డిలు చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ వాణిని పార్లమెంట్ లో వినిపించాలన్నారు. కంటితుడుపు చర్యలకు పోకుండా వాస్తవంగా ఆదుకోవాలన్నారు. వీరికి మొసలి కన్నీరు తప్ప ప్రజల పక్షాన ప్రేమ లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news