గత రాత్రి బెంగుళూరు మరియు కోలకతా ల మధ్యన జరిగిన ఐపీఎల్ గేమ్ లో కోల్కతా ఈ సీజన్ లో రెండవ సారి మ్యాచ్ ను గెలిచి బెంగుళూరు పై తమ ఆధిక్యాన్ని పెంచుకుంది. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిన కోల్కతా బెంగుళూరు తో మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో గెలిచి చాలా ముఖ్యమైన రెండు పాయింట్ లను దక్కించుకుంది. కాగా ఈ మ్యాచ్ లో కీలకం అయిన ఆటగాళ్లు విఫలం కావడంతో మిగిలిన వారంతా చేతులెత్తేసి బెంగుళూరు ఓటమిని ఖాయం చేశారు. విరాట్ కోహ్లీ ఒక్కడే అర్ద సెంచరీ సాధించి ఓటమై అంతరాన్ని తగ్గించాడు. కాగా జట్టులో ఒక ఆటగాడు పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు RCB ఆడిన అన్ని 8 మ్యాచ్ లలోనూ షహబాజ్ అహమ్మద్ అనే లెఫ్ట్ హ్యాండెడ్ ఆల్ రౌండర్ కు అవకాశం కల్పించింది.
కానీ అతని మాత్రం ఇప్పటి వరకు బ్యాటింగ్ లో కేవలం 42 పరుగులు చేయగా, బౌలింగ్ లో ఒక్క వికెట్ కూడా తీయడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకే ఇతన్ని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ నుండి డిమాండ్ వినబడుతోంది. ఇకనైనా RCB కోచ్ ఈ విషయంలో కళ్ళకి తెరుస్తాడేమో చూడాలి.