బ్లాక్ అవుట్ ఫిట్ లో అదరహో అనిపిస్తున్న ప్రభాస్ బ్యూటీ..!

-

ప్రభాస్ బ్యూటీ మాళవిక మోహనన్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇకపోతే గత కొద్ది రోజులుగా వెరైటీ కాస్ట్యూమ్స్ తో రకరకాల ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్న ఈమె ఇప్పుడు సోషల్ మీడియా ఫేవరెట్ సెలబ్రిటీగా మారిపోయింది. తాజాగా ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా డీలక్స్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది.

ప్రస్తుతం హీరోయిన్లు కూడా రకరకాల కాస్ట్యూమ్స్ ధరించి అందరిని ఆకట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా డిజైనర్ వేర్స్ తో ఫోటోషూట్ చేస్తున్నారు. ఇకపోతే మాళవిక మోహనన్ తాజాగా ప్రభాస్ మారుతీ సినిమాలో సైక్రియాటిస్ట్ పాత్రలో నటిస్తోంది.. పెట్టం పోలే అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మాళవిక ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. ఇక సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతుతో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా మరోక అద్భుతమైన ఫోటోషూట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మాళవిక. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో విదేశీ వీధుల్లో తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే మాళవిక మోహనన్ ఇప్పటివరకు తెలుగులో సినిమాలు చేయలేదు. ఆమధ్య రవితేజ సినిమాలో అవకాశం వచ్చినా వదులుకుంది. ఇక త్వరలోనే ఈమె ఎంట్రీ ఇవ్వాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. ఇక మాళవిక మోహనన్ ఎవరో కాదు హిందీ, మలయాళం సినిమాలలో సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకున్న మోహనన్ కుమార్తే ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news