కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

-

తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయం సముదాయంలో అడుగు పెట్టారు. అనంతరం ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సుముహూర్త సమయంలో కుర్చీలో ఆశీనులయ్యారు. అనంతరం మొత్తం ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు కేసీఆర్.

అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ” నూతన సచివాలయం ప్రారంభోత్సవ వేల శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పై మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరికీ శుభాకాంక్షలు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు”. అనీ ట్వీట్ చేశారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news