వైరల్ గా మారిన జ్యోతిక జిమ్ ఫోటోలు.. సెల్యూట్ అంటున్నసెలబ్రిటీలు..

-

టాలీవుడ్, కోలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించిన అందాల భామ జ్యోతిక. తెలుగులో మెగాస్టార్ సరసన ఠాగూర్, నాగార్జునతో మాస్ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే హీరో సూర్యను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన జ్యోతిగా సినిమాలకు దూరమయ్యారు. సోషల్ మీడియాలో సైతం పెద్దగా కనిపించకపోగా పబ్లిక్ ఫంక్షన్ లో మాత్రం సూర్యతో కలిసి హాజరవుతూ ఉంటారు. తాజాగా జ్యోతిక కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

article_image7

 

అందాల భామ జ్యోతిక జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ తన ఫిజిక్ కాపాడుకుంటోంది. తాజాగా జ్యోతిక తన వర్కౌట్ వీడియో షేర్ చేయగా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా జ్యోతిక జిమ్ ఫీట్స్ చేస్తూ హార్ట్ బీట్ రైజ్ చేస్తోంది. జ్యోతిక చేస్తున్న జిమ్ వర్కౌట్స్ ఎంతో రిస్క్ తో కూడుకున్నవిగా ఉన్నాయి. తలక్రిందులుగా జ్యోతిక చేస్తున్న వర్కౌట్స్ కి సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.

article_image3

అలాగే ఎంతో చలాకీగా వర్కౌట్ చేస్తున్న జ్యోతిక కొన్ని సందర్భాల్లో స్కిప్ అయి పడిపోవడం కూడా ఈ దృశ్యాల్లో చూడచ్చు. కానీ ఏమాత్రం బెదురు లేకుండా జ్యోతిక మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ వర్కౌట్స్ చూసిన స్టార్ సెలబ్రిటీలు యాషిక ఆనంద్, దియా మీనన్ సెల్యూట్ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మీ భర్త సూర్య కూడా ఇలాంటి ఫీట్లు చేయలేరేమో అని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

article_image5

కాగా ప్రస్తుతం జ్యోతిక వయసు 44 ఏళ్లు. స్టార్ హీరో సూర్యని పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు దూరమైనా జ్యోతిక ఇద్దరు పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలతో బిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే.

article_image4

article_image6

Read more RELATED
Recommended to you

Latest news