దీపావ‌ళికి 3 ఉచిత సిలిండ‌ర్ల ప‌థ‌కం అమ‌లు – మంత్రి నారాయణ

-

దీపావ‌ళికి 3 ఉచిత సిలిండ‌ర్ల ప‌థ‌కం అమ‌లు చేస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నారాయణ. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని మూలాపేటలో.. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం… కార్యక్రమం జరిగింది. ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. వంద రోజుల పాల‌న‌పై ప్రజలు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారని తెలిపారు ఏపీ మంత్రి నారాయణ.

Implementation of 3 Free Cylinders Scheme for Diwali said Minister Narayana

దీపావ‌ళి నాటికి మ‌హిళ‌ల‌కు మూడు ఉచిత సిలిండ‌ర్ల ప‌థ‌కం అమ‌లు చేస్తామని ప్రకటించారు. వంద రోజుల్లో పెన్ష‌న్ల పెంపు, డీఎస్సీ, అన్న‌ క్యాంటీన్లు, ల్యాండ్‌ టైటిలింగ్.. రివర్స్ టెండరింగ్ చట్టం రద్దు, చేశామని వివరించారు. జ‌గ‌న్ పిల్ల‌త‌నం, సైకో పాల‌న‌తో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం కూట‌మి ప్ర‌భుత్వం పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు కాస్త ఓపిక ప‌డితే ఏడాదిలో కూట‌మి ప్ర‌భుత్వ మార్క్ ను చూపిస్తామన్నారు ఏపీ మంత్రి నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news