‘అవన్నీ నాతోనే సమాధి అయిపోతాయి..’ సల్మాన్ ఖాన్..

-

టాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన సల్మాన్ ప్రేమ పెళ్లి పై మాట్లాడారు.

తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ను మీ జీవితం గురించి ఆటోబయోగ్రఫీ రాస్తే అందులో మీ ప్రేమకథలు ఉంటాయా అని ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “నా ప్రేమకథలన్ని నాతో పాటే సమాధి అయిపోతాయి.. ఇక పెళ్లి అంటే.. అది దేవుడి నిర్ణయం. రాసిపెట్టి ఉంటే జరుగుతుంది. అయినా నా వయసు ఇంకా 57 మాత్రమే. చేసుకుంటాను పెళ్లి. నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళే. తప్పంతా నాదే. మొదటి గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోయినప్పుడు ఆమెదే తప్పు అనుకున్నా. కానీ వచ్చిన ప్రతి అమ్మాయి నన్ను వదిలేసి వెళ్లిపోతుంటే అప్పుడు నాదే తప్పని తెలుసుకున్నాను. నేనే వాళ్ళని సరిగ్గా చూసుకోలేదేమో. వాళ్ళు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి.. పెళ్లి సంగతి ఏమో కానీ నాకు ఒక పాపని పెంచుకోవాలని ఉంది. కానీ అందుకు మన భారతీయ చట్టాలు ఒప్పుకోవేమో..” అని అన్నారు.

Bollywood Actor Salman Khan Compares Hectic Film Schedule To A "Raped ...

కాగా సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. 57 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా.. అడిగితే అదే అవుతుంది అని అంటాడు. బాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సల్మాన్ ఖాన్ పెళ్ళి వరకు మాత్రం వెళ్లలేదు అన్ని బ్రేకప్ లు గాని మిగిలిపోయాయి. కాగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే ఆయన అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news