కల్వకుంట్ల కేసీఆర్.. కరప్షన్ కేసీఆర్ అయ్యారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పంట నష్ట పరిహారం ఇప్పటి వరకు ఎందుకు విడుదల చేయలేదు… 9 లక్షల 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా అని తెలిపారు. అధికారులు వచ్చి కనీసం పంట నష్టం పై అంచనాలు వేయలేదని రైతులు చెబుతున్నారు…మార్చి నెలలో పడిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకే పరిహారం దిక్కు లేదు… ఇక ఏప్రిల్ నెలలో దెబ్బ తిన్న పంటలకు పరిహారం ఇస్తారా ? అని కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు.
9 ఏళ్లలో ఏ ఒక్కసారి పంట నష్ట పరిహారం ఇవ్వలేదు….కేసీఆర్ కి గిఫ్ట్ గా పాడైన పంట ట్రక్కును పంపిస్తున్న…ఇది పాడైన పంట కాదు ఇది.. రైతుల కన్నీరు అని పేర్కొన్నారు. పునర్నిర్మాణం ఎవరికైంది…కల్వకుంట్ల కేసీఆర్.. కరేపిషన్ కేసీఆర్ అయ్యారు…కల్వకుంట్ల కుటుంబం పునర్నిర్మాణం అయ్యిందని విమర్శలు చేశారు. మ్యానిఫెస్టోలో లేని దాని మీద లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు.తెలంగాణ పునర్నిర్మాణం ఎవరు అడిగారు. ఎవరు అడిగారు కాళేశ్వరం,సెక్రటేరియట్…? మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క వాగ్దానానికి కూడా కేసీఆర్ డబ్బులు ఖర్చు చేయడం లేదన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలకు డబ్బులు ఖర్చు చేస్తే కమీషన్లు రావు కాబట్టే వాటిని కేసీఆర్ చేయడం లేదని నిలదీశారు.