కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఓ హామీ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్, పిఎఫ్ఐ లాంటి మత విద్వేషాలు చేసే సంస్థలను నిషేధిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పై భజరంగ్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తగలబెడుతూ, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. తక్షణమే ఆ హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బజరంగ్దళ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు. బజరంగ్ దళ్ వంటి జాతీయవాద సంస్థలు పిఎఫ్ఐ వంటి నిషేధిత తీవ్రవాద సంస్థతో పోల్చడం సరికాదని మండిపడుతున్నారు బజరంగ్ దళ్ కార్యకర్తలు.
#WATCH | Telangana: Police detain Bajrang Dal members protesting against Congress' Karnataka election manifesto, in front of party office in Hyderabad.
The Congress has announced a ban on Bajrang Dal on the lines of PFI in its Karnataka Election 2023 manifesto. pic.twitter.com/NKTi61eaM6
— ANI (@ANI) May 3, 2023