2300 మంది విద్యార్థులకు ఉచిత విద్య… సచిన్ టెండూల్కర్ గ్రేట్ !

-

ఇండియా గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆటలోనే కాదు మానవత్వంలోనో ఎందరో మనసులను గెలుచుకున్నాడు. ఇప్పటికే నెల్లూరు జిల్లా పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుని దానిని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే . తాజాగా మరో మహత్తర సహాయ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్ లోని సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ పేరుతో సందల్ పూర్ లో ఒక పాఠశాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ పాఠశాల వలన రానున్న 10 సంవత్సరాలలో దాదాపుగా 2300 మంది పిల్లలకు ఉచిత విద్య అందనుంది.

 

సచిన్ తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం సక్సెస్ కావాలని ఆశిద్దాం. తన తల్లితండ్రులను ఎంతగానో ఇష్టపడే వారికీ ఈ స్కూల్ ను అంకితం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం పట్ల హ్యాపీ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ సచిన్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news