ఓ స్కూల్ ఫంక్షన్‌లో కూతురితో కలిసి దివ్యాంగుడైన తండ్రి వీల్‌ఛైర్‌లో కూర్చునే డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. తండ్రులకు కూతుళ్ల ప్రేమ ముందుగా దక్కుతుందని చెప్పనక్కర్లేదు. అంతటి స్వీట్ రిలేషన్‌షిప్‌కు అద్దం పట్టేలా ఈ క్లిప్‌ను ది ఫైజెన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వైరల్ క్లిప్‌లో స్కూల్ ఫంక్షన్‌లో కూతురితో కలిసి దివ్యాంగ తండ్రి డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. స్టేజ్‌పై తమ కూతుళ్లతో ఇతర వ్యక్తులూ ఉన్నారు. అయితే దివ్యాంగుడు తన పెర్ఫామెన్స్‌తో అందరి హృదయాలను కదిలించాడు. కూతురి కోసం ప్రయత్నించి విజయం సాధించాడు.
లోపాలను అధిగమించిన తండ్రి ఎలాంటి పొరపాట్లు చేయకుండా కూతురు కోసం ముందుకొచ్చాడని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుంచి ఏడు లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. ఈ క్లిప్‌ను చూసిన పలువురు నెటిజన్లు ఉద్వేగానికి లోనయ్యారు. నాన్నలు సూపర్ హీరోలని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఆనందభాష్పాలని మరో యూజర్ రాసుకొచ్చారు. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపంలా ఉంది ఈ వీడియో.
Despite everything, that dad is with his daughter, he did not make excuses!pic.twitter.com/9RZkwzhdED
— The Figen (@TheFigen_) May 2, 2023