మీషో ఉద్యోగులకు షాక్.. 250 మంది తొలగింపు

-

సాఫ్ట్‌బ్యాంక్‌ మద్దతు ఉన్న ఈ-కామర్స్‌ యూనికార్న్‌ మీషో ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీ మొత్తం సిబ్బందిలో 15 శాతానికి సమానమైన 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు అంతర్గత ఈ-మెయిల్‌ ద్వారా సమాచారం అందజేసింది. ఏడాది వ్యవధిలో ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. గతంలోనూ 250 మందిని తీసివేసింది.

స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్‌గా మారిన నేపథ్యంలోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైనట్లు మీషో సీఈఓ విదిత్‌ ఆత్రే లేఖలో పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల నియామకాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందని అన్నారు. అలాగే సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవడంలోనూ కొన్ని తప్పులు జరిగాయని వ్యాఖ్యానించారు. వీటిని నివారించడంలో ఇంకా మెరుగ్గా పనిచేయాల్సిందని పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి కంపెనీ  తరఫున సహకారం అందిస్తామని ఆత్రే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news