మీకు గుర్తుందా? వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా చేసిన ఆమ్రపాలి విగ్రహాన్ని అప్పట్లో తయారు చేయించి గత సంవత్సరం నవరాత్రి వేడుకల్లో ఏర్పాటు చేశారు. ఆ.. గుర్తుంది కదా.. సేమ్ ఇప్పుడు కూడా అలాగే.. సీఎం కేసీఆర్ విగ్రహాన్ని గణేశ్ మండపంలో ఏర్పాటు చేశారు. ఆమ్రపాలి విగ్రహాన్ని ఏర్పాటు చేసినవారే సీఎం కేసీఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాజీపేటలోని బాపూజీనగర్‌లో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలా వినూత్న రీతిలో మీరు పైన చూస్తున్న విధంగా గణపతి సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్నట్టుగా ఏర్పాటు చేశారు. ఇలా వినూత్నంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను చూడటానికి వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
గణపతి విగ్రహాన్ని మాత్రం చెరువులో నిమజ్జనం చేస్తామని.. సీఎం కేసీఆర్ విగ్రహాన్ని వరంగల్ టీఆర్‌ఎస్ ఆర్బన్ పార్టీ కార్యాలయానికి అందిస్తానని.. లేదంటే తానే స్వయంగా సీఎం కేసీఆర్‌కు ఆ విగ్రహాన్ని అందిస్తానని గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నార్లగిరి వినయ్ తెలిపాడు.