డైమండ్ లీగ్‌ తొలి అంచెలో స్వర్ణం సాధించిన నీరజ్‌ చోప్రా

-

అంతర్జాతీయ వేదికలపై భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తన సత్తా చాటుతున్నాడు. ఆట ఆటకూ తన ప్రదర్శనను మెరుగు పరుచుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్, డైమండ్ లీగ్ ఫైనల్లో గోల్డ్ మెడల్​తో మెరిసిన నీరజ్.. తాజాగా మరో ఘన విజయం సాధించాడు. దోహలో జరుగుతున్న డైమండ్‌ లీగ్‌ కొత్త సీజన్‌లో తొలి అంచె టోర్నీలో అదిరే ప్రదర్శనతో టైటిల్​ను ముద్దాడాడు.

శుక్రవారం జావెలిన్‌ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు నీరజ్‌. తొలి త్రోలోనే 88.67 మీటర్ల దూరాన్ని అందుకుని అగ్రస్థానం సాధించిన అతడు.. ఈ సీజన్లో బెస్ట్​ త్రో వేసిన ప్లేయర్​గా నిలిచాడు. ఆ తర్వాత 2, 3 త్రోలలో 86.04 మీ, 85.47 మీ. దూరం విసిరాడు.

నాలుగో ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన భారత స్టార్‌.. 5, 6 ప్రయత్నాల్లో 84.37 మీ, 86.52 మీటర్లు విసిరి గోల్డ్​ మెడల్​ను ఖాయం చేసుకున్నాడు. అయితే టైటిల్​ను సాధించినప్పటికీ నీరజ్‌.. తాను అనుకున్న 90 మీటర్ల లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news