వైఎస్‌ వివేకా కేసులో 10వ తేదీ తర్వాత ఊహించని అరెస్టులు – RRR

-

వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పదవ తేదీ తర్వాత ఊహించని అరెస్టులు ఉంటాయని… దిమ్మతిరిగి పోయే నోటీసులు ఉంటాయని బాంబ్‌ పేల్చారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణ రాజు గారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 70 వేల కోట్ల రూపాయల రుణ దీవెనకు జగనన్న దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి తాను గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, గతంలో ప్రధానమంత్రి గారికి జగన్ మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో తనని రోగ్ ఎంపీ అని సంబోధించారుని, అసలు రోగ్ ఎవరో అందరికీ తెలుసునని, తాను రఘునని పేర్కొన్నారు. ఎంత కాళ్ళ వేళ్ళ పడ్డా అదనంగా మరో 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల అప్పు లభించవచ్చునని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సంగతి ఏమిటి? అని, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఏమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news