కన్నడ భామల మధ్య గొడవ షురూ.. శత్రువు గా మారిన శ్రీ లీల..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా కన్నడ ముద్దుగుమ్మల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్ళ మధ్య శత్రువులు తయారయ్యారు అన్న వాదన తెరపైకి వచ్చింది.. నితిన్, సమంత జంటగా నటించిన అ ఆ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. అదేనండీ..” శత్రువులు ఎక్కడో ఉండరు.. మన చెల్లెల్ల రూపంలో.. కూతుర్ల రూపంలో మన మధ్య తిరుగుతూ ఉంటారు..” అనే డైలాగు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే డైలాగును కాస్త అటు ఇటు మార్చి రష్మిక అలాగే పూజా హెగ్డే లకు సింక్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక ఈ ముద్దుగుమ్మలిద్దరికీ శత్రువు ఎక్కడో లేరని.. తమ స్టేట్ లోనే ఉన్నారని.. వీరికి తీసిపోని అందంతోనే కాదు అంతకుమించి పాపులారిటీ దక్కించుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ యంగ్ లేడీ బ్యూటీ ఎవరో కాదు శ్రీ లీల.. శ్రీ లీల క్రేజ్ చూస్తుంటే సీనియర్ హీరోయిన్గా చలామణి అవుతున్న రష్మిక పూజా హెగ్డే ల కెరియర్ కు చిల్లు పడబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న వచ్చిన ఈ యంగ్ బ్యూటీ శ్రీలీలా వరుసగా తొమ్మిది చిత్రాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చిన్న హీరోలను మొదులుకొని పెద్ద హీరోల వరకు అందరి సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది. దీంతో అటు రష్మికాకు ఇటు పూజా హెగ్డే కి అవకాశాలు కరువయ్యాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. శ్రీ లీల డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానంటూ.. తన అందంతో మరింతగా ప్రేక్షకులను అలరిస్తోంది. పెళ్లి సందడి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాలలో కుర్రాళ్ల ఎదలు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక అప్పటినుంచి కుర్రాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందో ఏమో ఇప్పుడు దానికి న్యాయం చేస్తోందనే చెప్పాలి. అంతేకాదు స్టార్ హీరోలకు కూడా మోస్ట్ ఛాయిస్ హీరోయిన్గా మారిపోయిన ఈమె పూజా హెగ్డే , రష్మిక కెరియర్ కి శత్రువుగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా శ్రీ లీలా క్రేజ్ కారణంగా అటు వారిద్దరికీ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news