చై కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన సమంత… !

-

నిన్న అక్కినేని నాగచైతన్య కస్టడీ మూవీ ప్రమోషన్ లో భాగంగా తన వ్యక్తిగత జీవితం మరియు మాజీ భార్య సమంత గురించి కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. చై చేసిన వ్యాఖ్యలలో మేము బాగానే ఉన్నాము .. కానీ మా బంధాన్ని అభిమానులు , ప్రజలు తప్పుగా అర్ధం చేసుకున్నారు అని చెప్పాడు. కాగా ఈ వ్యాఖ్యలపై సమంత తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ అర్ధం ఈ విధంగా ఉంది.. మనమంతా ఒక్కటే .. మనలో ఉన్నా ఇగోలు , నమ్మకాలు మరియు భయాలే మనల్ని వేరు చేస్తాయి అని పోస్ట్ చేసింది.

ఇది చూసిన నెటిజన్లు నాగచైతన్య వ్యాఖ్యలకు భలే కౌంటర్ ఇచ్చింది అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ పోస్ట్ అర్ధం ఏమిటన్నది సమంతకు మరియు చై లకు అర్ధమైతే చాలు అంటూ కొందరు కౌంటర్ లు ఇస్తున్నారు. అయితే ఈ పోస్ట్ ద్వారా మళ్ళీ వీరిద్దరూ కలుస్తారేమో అని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news