“ఆదిపురుష్” ట్రైలర్ కు టైం ఫిక్స్… ఆనందంలో ప్రభాస్ ఫ్యాన్స్ !

-

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన మూవీ “ఆదిపురుష్” నుండి ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కొంతకాలం నుండి పలుమార్లు ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఇప్పుడు అని చెబుతున్న వివిధ కారణాలతో వాయిదాపడుతూ వచింది. అయితే ఎట్టకేలకు ట్రైలర్ తేదీ మరియు టైం తో సహా చిత్ర బృందం ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఆ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా మరియు కృతిసనన్ సీతగా నటిస్తుండగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అధికారిక సమాచారం ప్రకారం రేపు సాయంత్రం 5 .04 గంటలకు దేశవ్యాప్తంగా థియేటర్ లలో ట్రైలర్ ను 3D లో రిలీజ్ చేయనున్నారు.

కాగా అంతకు ముందే హైద్రాబాద్ లో మీడియా మరియు ఫ్యాన్స్ కోసం AMB లో ట్రైలర్ స్పెషల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మరి ట్రైలర్ ఏ స్థాయిలో ఉంటుందా అన్నది తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news